మొదటి భర్త అలా చేస్తున్నాడని భార్య ఏం చేసిందంటే?

శనివారం, 13 మార్చి 2021 (18:50 IST)
లైంగికంగా వేధిస్తున్నాడని ఓ భార్య తన మొదటి భర్తని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. అరవై ఐదేళ్ల వయసున్న మొదటి భర్త తనను లైంగికంగా వేధిస్తుండడంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. అతడిని కుర్చీలో కట్టేసి కత్తితో గొంతు కోసి హత మార్చింది. 
 
లైంగికంగా వేధించినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు