కొత్తగా పెళ్లయ్యాక కోడలు అత్తింటిలో అడుగుపెడుతుంది. ఆ కోడలిని అత్తమామలు స్వయంగా తమ కన్నకూతురులా చూసుకుంటారు. కానీ కొన్నిచోట్ల అత్తమామలు కోడళ్ల పట్ల కొరివి దెయ్యాలుగా మారుతున్నారు. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఖుర్దా పట్టణంలోని అత్తామామలు తమ ఇంటికి వచ్చిన కోడలిపై చేసిన అఘాయిత్యం తెలుసుకుని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
వివరాలను చూస్తే... ఖుర్దా పట్టణంలో ఉంటున్న డాక్టరు నీరజానళిని, మహంతి తమ కుమారుడికి 20 రోజుల కిందట వివాహం చేశారు. ఐతే కోడలు తెచ్చిన కట్నం చాల్లేదంటూ నసగడటం మొదలుపెట్టారు. ఆమె అత్తమామల విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. దీనితో వారు కట్నం రాబట్టేందుకు పైశాచికమైన ఆలోచన చేశారు. కొత్త కోడలి పడక గది సన్నివేశాలను సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించారు.