అయితే, సాయంత్రం వేళ... బీచ్‌లో పెద్దగా జనాలు లేని సమయంలో ఈ జంట ఆ ముగ్గురు వ్యక్తుల కంటపడింది. అంతే.. ఆమె ప్రియుడిని కట్టేసిన ఆ కామాంధులు.. ఆ యువతిని చెరబట్టి.. బలవంతంగా దుస్తులు తొలగించారు. ఆ తర్వాత ఇద్దర్నీ నగ్నంగా ఫోటోలు తీసి, డబ్బులు గుంజుకుని, యువతిపై ఆమె స్నేహితుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు చెబితే ఇద్దరి ఫోటోలు బయటపెడతామని బెదిరించి అక్కడినుంచి పారిపోయారు.
అయితే, బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు వేగంతో స్పందించి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని దక్షిణ గోవా ఎస్పీ అర్వింద్ గవాస్ పేర్కొన్నారు. వైద్యపరీక్షల్లో యువతిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కావడంతో.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 అత్యాచారం), సెక్షన్ (దోపిడీ) సహా పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. gang rape