చెన్నైలోని లేడీస్ హాస్టల్‌లో రహస్య కెమెరాలను వుంచిన వ్యవహారం ఇటీవలే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో ఓ యువతి దుస్తులు మార్చుకోవడం.. హోటల్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో మహిళలపై అభ్యంతరకర వీడియోలను రికార్డు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంతలో చెన్నై సెంట్రల్ సమీపంలోని హోటల్‌లో కేరళకు చెందిన సురేష్ అనే వ్యక్తి.. ఓ వివాహం కోసం ఈ హోటల్‌లోకి దిగాడు.
మొత్తం 46మందితో కూడిన పెళ్లి బృందం ఈ హోటల్‌లో బస చేసింది. ఆ సమయంలో తాము బస చేసిన గదిలోని కెమెరాలపై సురేష్‌కు అనుమానం వచ్చింది. ఈ కెమెరాలతో పాటు, రిసెప్షన్‌లోని కంప్యూటర్లో వుండే దృశ్యాలు ఒకేలా వున్నాయి.