యాసిడ్ దాడి అనంతరం బాధితురాలి అత్త, ఇతర కుటుంబ సభ్యులు పారిపోయారు. ఇంతలో ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సంత్ నగర్ బురారీలో అంజలిని అరెస్టు చేశారు.
ఇతర కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు అంజలిపై ఐపీసీ సెక్షన్ 323, 326ఏ, 34 కింద పలు కేసులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో బాధితురాలికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు 6 నెలల పాప కూడా ఉంది. అంజలి తన కోడలు తనపై కేసు పెట్టిందనే కోపంతో యాసిడ్‌తో దాడి చేసిందని తెలిసింది.