తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మంగళవారం (జూన్ 22,2021) 14 కిలోమీటర్లు గిరివలయం రోడ్డుపై అంగప్రదక్షిణ చేసింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి రోజున భక్తులు గిరిప్రదక్షిణ (గిరివలయం) చేస్తుంటారు. ముఖ్యంగా చిత్ర పౌర్ణమి, కార్తీక దీపోత్సవ పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటారు.
అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుండి అనేక కోణాలనుంచి కనిపించే ఏకైక ముఖ్యశిఖరంతో అలరారే ఏకపర్వతం. పరిక్రమ లేక ప్రదక్షిణ అంటే అరుణాచలం చుట్టూ వున్న 14 కి.మీ.ల మార్గాన్ని సవ్యదిశలో పాదరక్షలు లేకుండా నడచి పూర్తిచెయ్యడం. అంటే, గిరి కుడివైపుకు వచ్చేలా చుట్టిరావడాన్ని గిరిప్రదక్షిణం అంటారు.