శబరిమల ఎంట్రీ : మహిళల ప్రవేశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (14:36 IST)
ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణను ముగ్గురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి మిశ్రాతో కూడిన జడ్జిల బెంచ్... రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. 
 
కేసుకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలపై సందేహాలను లేవనెత్తింది. ప్రస్తుతం శబరిమల ఆలయంలోకి 10 ఏళ్ల లోపు, 50ఏళ్ల పైబడిన మహిళలకు ప్రవేశం ఉంది. పదేళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న స్త్రీలకు నిషేధం ఉంది. 
 
రాజ్యాంగం ప్రకారం ఇది హక్కులను కాలయాటమే అని గతంలోనే సుప్రీంకోర్టు శబరిమల ఆలయ బోర్డును ప్రశ్నించింది. ఈ కేసు మత విశ్వాసానికి, రాజ్యాంగ హక్కులకు ముడిపడి ఉండటంతో.. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి త్రిసభ్య బెంచ్ బదిలీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు