ప్లాంట్ బయట పార్క్ చేసి ఉంచిన కార్లు, ఫర్నిచర్‌ను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. కోలార్ జిల్లాలోని నరసాపురా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి 51కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
వర్కర్లు రాళ్లు, అద్దాలు పగలగొట్టి, వాహనాలు చెడగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పాడుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు శాలరీ సమస్యలే కారణమని తెలుస్తోంది. చాలామంది ఉద్యోగులు కాంట్రాక్ట్ మీదే పనిచేస్తున్నారని.. అంతేకాకుండా వారి శాలరీలో చాలా రకాల కోతలు విధిస్తూ వచ్చిందని కంపెనీపై వర్కర్లు ఆరోపించారు.