యడ్యూరప్పకు దిగిపొమ్మంటున్న బీజేపీ.. కానేకాదంటున్న అరుణ్ సింగ్

శుక్రవారం, 11 జూన్ 2021 (11:56 IST)
దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి చుక్కానిలా నిలిచిన నేత బీఎస్.యడ్యూరప్ప. తన ఒక్కడి పట్టుదల, కృషి ఫలితంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే, ఇపుడు బీజేపీకి యడ్యూరప్ప పనికిరావడం లేదు. దీంతో ఆయనకు పదవీగండం వెంటాడుతోంది. యడ్యూరప్పను మార్చాల్సిందేనంటూ కర్నాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. వీరి ఒత్తిడికి బీజేపీ అధిష్టానం తలొగ్గింది. ఫలితంగా వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని యడ్డీని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర వర్గాలు కూడా ధృవీకరించాయి. 
 
మరోవైపు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరుణ్‌సింగ్ మాత్రం నాయకత్వ మార్పులపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. మరోవైపు, ఈ నెల 17, 18 తేదీల్లో ఆయన బెంగళూరుకు రానుండడం చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఆయన రాక నాయకత్వ మార్పునకు సంకేతమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
 
అదేసమయంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, యడ్యూరప్ప న ఉత్తమంగా పాలిస్తున్నారని ప్రశంసించారు. సీఎం పనితీరుపై బీజేపీ అధినాయకత్వం సంతృప్తిగా ఉందని, నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను కలిసి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు