కర్నాటకలో లాక్డౌన్ పొడగింపు... సీఎం నిర్ణయం

గురువారం, 3 జూన్ 2021 (18:17 IST)
కర్నాటక రాష్ట్రంలో మరోమారు లాక్డౌన్‌ను పొడగించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో లాక్డన్‌ను ఈనెల 14 వరకూ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. 
 
రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్‌ నిబంధనలే కొనసాగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు