ఉత్తరప్రదేశ్‌లో రాత్రికి రాత్రే 140 మంది అధికారుల బదిలీ.. యోగి ఆదేశాలు

గురువారం, 27 ఏప్రియల్ 2017 (13:28 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రే 140 మంది సివిల్ సర్వీస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. వీరిలో 84 మంది ఐఏఎస్‌లు ఉండగా, 54 మంది ఐపీఎస్‌లు ఉన్నారు. 
 
దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనా వ్యవస్థపై పట్టు సాధిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 140 మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. యోగి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత ఎక్కువ మందిని ఒకేసారి బదిలీ చేయడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
 
వీరిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇటీవల షహరాన్‌పూర్‌ జిల్లాలో ఘర్షణలు జరిగిన వారం రోజుల్లోనే బదిలీల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి