భద్రత కుదింపు... అఖిలేష్ - మాయావతిలకు సీఎం యోగి షాక్

ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (11:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక సంచలన నిర్ణయాలతో ముందుకుసాగిపోతున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాలకు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయన నిర్ణయాలకు ఉలిక్కిపడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు, బీఎస్‌పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతిలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను తగ్గించారు. 
 
శనివారం రాత్రి జరిగిన సెక్యూరిటీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన డీజీపీ సుల్ఖాన్ సింగ్, హోం శాఖ ప్రధాన కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, సెక్యూరిటీ ఏడీజీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భద్రతను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శనివారం రాత్రి నుంచే అమల్లోకి తెచ్చారు. 
 
అఖిలేశ్ యాదవ్, మాయావతిలకు మాత్రమే కాకుండా సమాజ్ వాదీ పార్టీ నేతలు శివ్‌పాల్ యాదవ్, డింపుల్ యాదవ్, అజం ఖాన్‌లకు కూడా భద్రతను తగ్గించారు. మరోవైపు బీజేపీ నేత వినయ్ కతియార్‌కు భద్రతను పెంచి, జడ్ కేటగిరి పరిధిలోకి తీసుకుని రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి