ఐతే ఇప్పుడతడి జీవితం పూర్తిగా మారిపోయింది. అతడి బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ. 36 లక్షలు వున్నాయి. ఒడిషా ప్రభుత్వం అతడి కుమార్తె చదువు బాధ్యతను తీసుకుంది. మరో విషయం ఏమిటంటే... అతడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అతడికిది మూడోపెళ్లి. ఇందిరా ఆవాస యోజన క్రింది ఒడిషా ప్రభుత్వం అతడికి పక్కా ఇల్లు కూడా కట్టించింది. మంగళవారం నాడు అతడు మార్కెట్లోకి వచ్చిన కొత్త బైకు కొనుక్కుని దానిపై కూర్చుని ఓ స్టిల్ పోస్ట్ చేశాడు. ఇప్పుడా ఫోటో వైరల్ అవుతోంది.