జొమాటో కేసు: ఆ యువతి పరారైందా? జొమాటో జోకులిక్కడ

బుధవారం, 17 మార్చి 2021 (18:28 IST)
జొమాటో కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్డర్ డెలివరీ సమయంలో బోయ్ తనపై దాడి చేశాడంటూ బెంగుళూరుకు చెందిన యువతి చంద్రాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనితో అతడిని అరెస్టు చేసారు. ఆపై అతడు బెయిల్ పై తిరిగివచ్చి తిరిగి చంద్రాణిపై కేసు వేశాడు.
 
తన పట్ల చంద్రాణి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తనపై షూ విసిరేసిందంటూ కేసు పెట్టాడు. ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల తన పరువు పోయిందంటూ పేర్కొన్నాడు. దీనితో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. 
 
విచారణకు హాజరు కావాలని ఆమెకి ఫోన్ చేస్తే తను ప్రస్తుతం ఇక్కడ లేననీ, మహారాష్ట్ర వెళ్లినట్లు చెప్పినట్లు సమాచారం. దీనితో మీడియాలో ఆమె పరారైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది తేలాల్సి వుంది. ఇదిలావుంటే జొమాటో కామెడీ అంటూ నెటిజన్లు పలు వీడియోలను సృష్టించి వదులుతున్నారు. చూడండి మీరు కూడా.. 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chudarshan (@chudarshan)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు