పెళ్లిచూపులుకి వెళ్దాం రమ్మని కారులో ఎక్కించుకుని స్నేహితులు గ్యాంగ్ రేప్

శనివారం, 13 మార్చి 2021 (12:46 IST)
నీకు చక్కటి సంబంధం చూసాం. పెళ్లిచూపులు ఏర్పాటు చేశాం. వెల్దాం రమ్మంటూ తన స్నేహితులే చెప్పడంతో అది నిమజని నమ్మింది ఆ యువతి. వెంటనే వారితో పాటు కారులో ఎక్కి కూర్చుంది. అలా కొంతదూరం వెళ్లాక ఆ ముగ్గురు కామాంధులయ్యారు. వాహనం రన్నింగులో వుండగానే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేసారు.
 
మీరట్‌కు చెందిన 20 ఏళ్ల యువతి గురువారం కదిలే ఎస్‌యూవీలో ముగ్గురు పురుషులు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురు కూడా మహిళకు తెలిసినవారేనని అన్నారు. మసూరి పోలీస్‌ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని 376 డి (సామూహిక అత్యాచారం), 354 (వేధింపుల) కింద ముగ్గురు నిందితులపై గురువారం రాత్రి మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మీరట్‌లోని తన ఇంటికి ముగ్గురు స్నేహితులు వచ్చి తమ స్కార్పియో ఎస్‌యూవీలో తనకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశామని, మంచి మ్యాచ్ కుదిరిందని మాయమాటలు చెప్పారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ముగ్గురు ఎస్‌యూవీలో కూర్చోమని చెప్పారని యువతి ఆరోపించింది. అలా రాత్రి వరకూ తనపై అఘాయిత్యం చేశారని ఆమె తెలిపింది.
 
రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు మసూరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, తనపై సామూహిక అత్యాచారం చేసి, వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు