దసరా 2024: సుందరకాండ పారాయణం.. జమ్మిచెట్టు కింద దీపం

సెల్వి

గురువారం, 10 అక్టోబరు 2024 (23:44 IST)
శ్రీ రాముడు లంకాధీసుడు రావణుడిని సంహరించి రావణుని చెర నుండి సీతాదేవిని విడిపించిన దసరా రోజున శుభకార్యాలు చేయడం మంచిది. ఈ ఏడాది దసరా శనివారం 12 అక్టోబర్ 2024న జరుపుకోనున్నారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినట్లు చెబుతారు. 
 
దసరా రోజున జమ్మి వృక్షానికి పూజ చేయాలి. నవమి రోజు రాత్రి జమ్మి చెట్టు లేదా మొక్క కింద దీపం వెలిగించడం ద్వారా అదృష్టం వరిస్తుంది. దసరా రోజున చీపురు దానం చేయడం శుభప్రదం. దసరా రోజు సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
దసరా రోజున సుందరకాండ పారాయణం కోరిన కోరికలను నెరవేరుస్తుంది. ఈరోజు సుందరకాండను పఠించడం ద్వారా అభివృద్ధి పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు