నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారిని ఇలా ప్రార్థిస్తే..?

మంగళవారం, 16 అక్టోబరు 2018 (15:45 IST)
అమ్మవారంటే పార్వతీదేవి. ఈమే పరమేశ్వరునికి తపస్సు చేసి స్వామివారిని మెప్పించి మరి పెళ్లిచేసుకున్నారు. లోక నాయకుడైన శివుడు అందరి మన్ననలను పొందుతాడు. కోరిన వరాలను తక్షణమే నెరవేర్చుతాడు. అలానే అమ్మవారు కూడా ఈ నవరాత్రులతో మహిమాన్వితమైన భక్తిశ్రద్ధలతో భక్తులచే పూజలు అందుకుంటారు.
 
ఈ నవరాత్రులలో దుర్గాదేవిగా భక్తులకు దర్శమిస్తుంటారు. ఎందుకంటే ఓ నాడు రాక్షసుడు పార్వతీదేవిని తనదానిని చేసుకోవాలనే ప్రయత్నించాడు. అప్పుడు అమ్మవారికి కోపం వస్తుంది. దాంతో ఆమె దుర్గాదేవి అవతారమెత్తి ఆ రాక్షసుని చంపుతుంది. నవరాత్రులలో ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు (17-10-2018) అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే శుభం కలుగుతుంది...
 
''సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవీ నమోస్తుతే''
 
అమ్మవారిని ఆరాధించడం వలన సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. అంతేకాకుండా దుర్గతులను నశింపజేసి సద్గతులను, సిరిసంపదలను ప్రసాదించే దివ్యస్వరూపిణిగా దర్శనమిస్తారు. అందువలన తప్పకుండా అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు సమర్పించి దీపారాధనలు చేయాలని పండితులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు