నవరాత్రుల్లో ఆరవ రోజున (సెప్టెంబర్ 26) దుర్గా మాత అవతారమైన కాత్యాయనీ మాతని పూజిస్తారు. కాత్యాయనీ మాతని పసుపు పచ్చ రంగు దుస్తులతో అలంకరించి మహా షష్టిని జరుపుకుంటారు. భక్తులు ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. మహిషాసురుడిని వధించిన ఈమెను కాత్యాయని రూపంలో పూజించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. గులాబీ రంగు పువ్వులంటే కాత్యాయని దేవికి ప్రీతికరం.
ఈ రోజున కాత్యాయనీ వ్రతం ఆచరించే కన్యలకు నచ్చిన వరుడితో వివాహం అవుతుంది. సద్గుణమైన వరుడితో కన్యలకు వివాహం అవుతుంది. వివాహం రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు, వివాహం అయ్యాక విడాకులు తీసుకున్నవారు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించవచ్చు. జాతక చక్రంలో కుజదోషం వున్నవారు, ఆర్థిక స్తోమత లేక వివాహానికి ఆటంకాలు ఎదుర్కొనే వారు కాత్యాయనీ వ్రతం ఆచరిస్తే శుభం చేకూరుతుంది. స్త్రీ జాతక చక్రంలో రాహుకేతు దోషాలు వున్నవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
కాత్యాయనీ అమ్మవారిని...
"చందరహోసోజ్వలకరం శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ." అనే మంత్రంతో పూజిస్తే సర్వదా శుభఫలితాలు చేకూరుతాయి.