నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సరస్వతీ పూజ, దుర్గాష్టమి, మహాగౌరీ పూజ, సంధి పూజ చేసుకోవచ్చు. అష్టమి రోజున వచ్చే ఈ రోజు(28 సెప్టెంబర్)న భక్తులు గులాబీ రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున మహాగౌరి మాతను పూజించడం ద్వారా భక్తులు చేసిన పాపాల నుండి రక్షించి వారిని పునీతులను చేస్తుంది. అమ్మవారిని నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరిస్తారు.
దుర్గాష్టమి రోజున సరస్వతీ దేవిని నిష్ఠగా పూజించే వారికి ఐశ్వర్యాలు, జ్ఞానం చేకూరుతుంది. ఈ రోజున తొమ్మిది శక్తి రూపాలతో అమ్మవారిని అలంకరించుకుని, పెళ్లికాని కన్యలు పూజ చేయాలి. అందుకే ఈ పూజను కుమారి పూజగా కూడా పిలుస్తారు. అష్టమి తిథిలోనూ చివరి 24 నిమిషాలు, నవమి తిథి ప్రారంభంలోని 24 నిమిషాలను సంధి కాలం అంటారు. ఈ సమయంలో దుర్గా పూజ చేసి, బలిదానం కోసం గుమ్మడికాయ కొట్టాలి.