అసలే వర్షాలు.. ఈ వర్షాల్లో హాట్ హాట్‌గా సూప్ తాగితే వావ్ అంటారు. ఇంకా చికెన్ సూప్ అంటే లొట్టలేసుకుంటారు. హై ప్రోటీన్ గల చికెన్‌ను తీసుకోవడం ద్వా కండరాల పటిష్టతో పాటు ఆరోగ్యమైన శారీరక బరువు కలిగివుంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత చికెన్ సూప్‌ను వారానికి రెండు సార్లు.. లేదా ఒక్కసారైనా తీసుకోండి.
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకోవాలి. తర్వాత చికెన్ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసి రెండు నిమిషాలాగి చికెన్ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాలపొడి వేసి పదినిమిషాలు ఉడికించి స్టౌపై నుంచి దించేయాలి. చివరిగా అజినమోటో వేసి హాట్ హాట్‌గా సర్వ్ చేయండి.