వారానికి రెండు సార్లు చేపలను తింటే దాంతో డయాబెటిస్ దూరం అవుతుంది. గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింటే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం..
తయారు చేసే విధానం :
ముందుగా కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలపాలి. ఆ మిశ్రమంలో శుభ్రం చేసి ఉంచిన చేప ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద బాణలిని పెట్టుకుని నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. అంతే... వేడి వేడి చేపల పకోడీలు రెడీ.