అరటికాయ చిప్స్ తయారీ విధానం...

సోమవారం, 18 జూన్ 2018 (12:05 IST)
అరటిపండును తింటే లావైపోతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే పచ్చిఅరటితో బరువును తగ్గించుకోవచ్చు. అరటికాయలోని విటమిన్ బి-6, శరీరంలోని కొవ్వుని కరిగించి, అధిక బరువును నియంత్రిస్తుంది. మరి అలాంటి ఈ అరటికాయతో రుచికరమైన వంటకాన్ని తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
పచ్చి అరటికాయలు - 3
ఉప్పు - సరిపడా
కారం - సరిపడా
పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా పచ్చ అరటికాయల తోలును తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగిన తరువాత అరటికాయ ముక్కలను కాసేపు ఎండబెట్టుకోవాలి. ఇక వాటిని తీసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ అరటి ముక్కులను వేసి బాగా వేగనివ్వాలి. అంతే అరటికాయ చిప్స్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు