చికెన్‌తో సమోసా ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 25 ఆగస్టు 2018 (13:30 IST)
కావలసిన పదార్థాలు:
చికెన్ - 400 గ్రాములు 
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం తరుగు - 2 స్పూన్స్
పసుపు - 1/2 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
మైదాపిండి - 2 కప్పులు
 
తయారీ విధానం: ముందుగా మైదాపిండిని ఓ గిన్నెలో వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నూనెను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకుని తరువాత అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. రెండు నిమిషాల తరువాత పసుపు, మిరియాలపొడి, చికెన్ మసాలా, సన్నగా కోసిన చికెన్ వేయాలి.

చికెన్ కాస్త మెత్తబడిన తరువాత ఆ మిశ్రమంలో తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకుని దింపేయాలి. ఇప్పుడు మైదాపిండిని ఉండల్లా చేసుకుని చపాతీలా ఒత్తి నిలువుగా కోయాలి. అందులో ఒక భాగాన్ని త్రికోణాకారంలో చుట్టి రెండు చెంచాల చికెన్ మసాలను అందులో వేసుకుని సమోసాలా చేసుకునే నూనెలో వేయించుకుంటే వేడివేడి చికెన్ సమోసా రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు