ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ముందుగా కుక్కర్‌లో మటన్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేడయాక్కా ఉల్లిపాయలు, గరం మసాలా వేసి కాసేపు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ తరువాత ఉడికించిన మటన్, తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే... గోంగూర మటన్ రెడీ.