మాంసాహర వంటల్లో చికెన్ వంటలు నోరూరిస్తాయి. ఎందుకంటే చికెన్ అద్భుతమైన రుచి, ఘుమఘుమల వాసన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చికెన్ వంటలకు చాలా ప్రసిద్ది. అంతేకాదు, చికెన్ వంటలను వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. చికెన్ వంటలను డిఫరెంట్ స్టైల్లో ప్రయత్నించడం చాలా సులభం.
వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ - అర టేబుల్ స్పూను
డీప్ ఫ్రై చేయడానికి- సరిపడా నూనె
ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లిపాయలు - ఒక కప్పు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
సోయా సాస్ - ఒక టేబుల్ స్పూను,,పచ్చిమిర్చి - 2 (సన్నగా కట్ చేసుకుని, అందులోని విత్తనాలు తీసేయాలి)
వెనిగర్ - రెండు టేబుల్ స్పూన్లు, నీళ్ళు : సరిపడా
తయారుచేయు విధానం :
1. ఒక గిన్నె తీసుకుని, అందులో కార్న్ ఫ్లోర్ , వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గుడ్డు, నీళ్ళు పోసి, చిక్కగా..జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కడాయ్ స్టౌమీద ఉంచి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన వాటిని టిష్యు పేపర్ మీద వేయడం వల్ల అదనపు నూనెను పీల్చుకుంటుంది.
ఆంధ్ర స్టైల్ చికెన్ 65...
2. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో సోయా సాస్, వెనిగర్, ఫ్రైడ్ చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని గ్రేవీలాగా కావాలనుకుంటే మీరు కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. అంతే సర్వ్ చేయడానికి బోన్‌లెస్ చికెన్ రెసిపి రెడీ.