టేస్టీ టేస్టీ చికెన్ కటీ రోల్ ఎలా చేయాలో తెలుసా..?

సోమవారం, 5 నవంబరు 2018 (11:25 IST)
భారతీయా వంటకాల్లో చికెన్ ఒకటి. చికెన్‌లో ప్రోటీన్స్, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చికెన్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. అధిక బరువు గలవారు తరచుగా చికెన్ తీసుకుంటే బరువు తగ్గుతారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. 100 గ్రాముల ఉడికించిన చికెన్‌లో 239 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. దాంతో పాటు విటమిన్ బి6, బి12, డి, ఐరన్ వంటివి కూడా ఉంటాయి. మరి ఇటువంటి చికెన్‌తో కటీ రోల్ ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 250 గ్రాములు
కోడిగుడ్డు - 2
చికెన్ - 500 గ్రాములు
క్యాప్సికం - 25 గ్రాములు
ఉల్లిగడ్డ - 1
టమోటా గుజ్జు - 50 గ్రాములు
పచ్చిమిర్చి - 25 గ్రాములు
కొత్తిమీర - 1 కట్ట
కారం - తగినంత
చాట్ మసాలా - 1 స్పూన్
నూనె - తగినంత
ఉప్పు - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా మైదాపిండిలో కోడిగుడ్డు, ఉప్పు, నూనె వేసి అరగంట పాటు అలానే వదిలేయాలి. ఆ తరువాత ఈ పిండిని రుమాలీ రోటీల్లా చేసుకుని పెనం పై కాల్చాలి. ఇప్పుడు చికెన్‌ని చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించి క్యాప్సికం, పచ్చిమిర్చి, టమోటా గుజ్జు, కారం, చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి పావుగంట తరువాత చాట్ మసాలా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిక తరువాత ముందుగా తయారుచేసుకున్న రోటీల్లో ఈ మిశ్రమం పెట్టి కటీ రోల్‌లా చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ కటీ రోల్ రెడీ.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు