పన్నీర్ పాల ఉత్పత్తులతో తయారుచేస్తారు. పన్నీర్‌లో క్యాల్షియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మధుమేహ వ్యాధి గలవారు ప్రతిరోజూ పన్నీర్ తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాంతో పాటు పన్నీర్‌లోని క్యాల్షియం పళ్లు, ఎముకలను బలంగా చేస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
తయారీ విధానం:
ముందుగా జీడిపప్పులను గంటపాటు నానబెట్టి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు టామోటా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి. బాణలిలో నూనెను వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేయించి ముందుగా తయారుచేసుకున్న జీడిపప్పు పేస్ట్, టమోటా పేస్ట్, ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కొన్ని నీళ్లు పోసి పన్నీర్, వెన్న, క్రీమ్ వేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి చివరగా నిమ్మరసం వేసి దించేయాలి. అంతే పన్నీర్ మిర్చీకా కుర్మా రెడీ.