ఎప్పుడూ మటన్, చికెన్, కోడిగుడ్డు, చేపలు వంటి వాటిని తీసుకుని బోర్ కొడుతుందా? అయితే రొయ్యలను వారానికి ఓసారి డైట్‌లో చేర్చుకోండి. మాంసాహారాలన్నింటి కంటే రొయ్యల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు రొయ్యలను తినడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. రొయ్యల్లో విటమిన్ బీ12 అధికంగా వుంటుంది. తద్వారా మతిమరుపు సమస్య వుండదు.
రొయ్యల్లోని క్యాల్షియం దంతాలు, ఎముకలను దృఢంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. తద్వారా హృద్రోగాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.