గోంగూర బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం....

మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:24 IST)
గోంగూరలో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. రేచీకటి, రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవడం అనే నేత్ర వ్యాధి లేదా దృష్టి దోషంతో బాధపడేవారు భోజనంలో గోంగూరను వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. ఇటువంటి గోంగూరతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 1 కప్పు
గోంగూర - 2 కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర - అరకప్పు
లవంగాలు - 4
దాల్చిన చెక్క - చిన్నముక్క
బిర్యాని ఆకు - 1
నెయ్యి - 1 స్పూన్
నూనె - 1 స్పూన్
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనె పోసి గోంగూరను మొత్తగా ఉడికించి రుబ్బి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో నెయ్యి పోసి వేడెక్కాక దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, జీడిపప్పు, లవంగాలు బాగా వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , కొత్తిమీర, ఉప్పు కొంచెం వేసి బాగా వేగించాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వాసన వచ్చే వరకు వేయించాలి. వెంటనే గోంగూర వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాస్మతి రైస్‌ వేసి తగినన్ని నీళ్లు పోయాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దించేయాలి. అంతే... గోంగూర బిర్యానీ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు