విడుదలైన కొద్ది రోజుల్లోనే, మీసాల పిల్ల యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది, వరుసగా 13 రోజులు అగ్రస్థానాన్ని కొనసాగించి 36 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఈ పాట పాన్-ఇండియా సంచలనంగా మారింది, నేషనల్ మ్యూజిక్ స్టేజ్ పై తెలుగు సినిమాకు ఇది ప్రౌడ్ మూమెంట్.
పండుగ వాతావరణంలో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, నాస్టాల్జియాతో నిండిన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. “మీసాల పిల్ల” పాట చిరంజీవి గారి టైమ్‌లెస్ చార్మ్, అద్భుతమైన డాన్స్ మూవ్స్, హ్యుమర్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన నయనతారతో ఆయన కెమిస్ట్రీ కొత్తదనాన్ని తీసుకొచ్చింది.
సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.