అమరావతి రాజధానికి రూ.5 లక్షలు విరాళమిచ్చిన ఎన్నారైలు, ఏపీ ఉద్యోగులు రూ.30 లక్షలు

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (19:54 IST)
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రవాసాంధ్రులు అందజేశారు. ప్రవాసాంధ్రులు కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, సుధాకర్‌లు ముఖ్యమంత్రిని కలిసారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తమ తల్లిదండ్రులు స్వర్గీయ కాట్రగడ్డ సుబ్బారావు, కాళికాంబ దంపతుల జ్ఞాపకార్థం ప్రజా రాజధాని అమరావతికి రూ.5 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ అయినంపూడి వెంకట శ్రీధర్‌, టీడీపీ నాయకులు కాకుమాను కనకరాంబాబు, కొత్తమాసు హేమశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు అమరావతి రాజధాని కోసం ఏపీడీఎఎస్‌సిఎసి ఉద్యోగులు తమ 15 రోజుల జీతాన్ని రూ. 30 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు