శాట్(ఎస్.ఏ.టి) వెబినార్ నిర్వహించిన నాట్స్

మంగళవారం, 8 జూన్ 2021 (21:03 IST)
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా శాట్ పై వెబినార్ నిర్వహించింది. అమెరికాలో విద్యార్ధులకు ఎంతో కీలకమైన శాట్ పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలి..? శాట్ స్కోర్ ఎలా సాధించాలనే దానిపై ఈ వెబినార్‌లో అవగాహన కల్పించారు. నాట్స్ టెంపా బే విభాగం చేపట్టిన ఈ వెబినార్‌లో ప్రముఖ ప్లిప్ సెట్టర్ అకాడమీ-ఎ ట్యూటర్స్.కామ్ గ్రూప్ సీ.ఈ.ఓ సబ్రీష్ కృష్ణన్ పాల్గొన్నారు.
 
విద్యార్ధులకు శాట్ పై దిశా నిర్దేశం చేశారు. శాట్‌ స్కోరు సాధన, స్కాలర్‌షిప్‌లు ఎలా సంపాదించాలి..? ఇలాంటి అంశాలపై విద్యార్ధులకు స్పష్టత ఇచ్చారు. హైస్కూల్ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి... వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆన్ లైన్‌ ద్వారా వందల మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.
 
ఇంకా ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుతికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ (ఫైనాన్స్/మార్కెటింగ్) ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, జాయింట్ కోఆర్డినేటర్ సురేశ్, అమల్ యెల్కుర్, డాక్టర్ సుదర్శన్ కామిశెట్టి, సుజయ్ కామిశెట్టి, శివకుమార్ పంగులూరి తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన బోర్డు చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే, రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమను, రంజిత్ చాగంటి, మురళీకృష్ణ మేడిచర్ల కు నాట్స్ టెంపా బే విభాగం కృతజ్ఞతలు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు