TeNF ఆధ్వర్యంలో లండన్‌లో వైభవంగా బోనాల సంబురాలు(వీడియో)
మంగళవారం, 4 జులై 2017 (14:24 IST)
స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయబద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, డాన్సులు డప్పుల దరువులతో ఈస్ట్‌హాం(eastham) పట్టణమంతా లష్కర్ బోనాల పండుగ వాతావరణాన్నిసృష్టించారు మన తెలంగాణా NRIలు. వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారుచేసిన తొట్టెలు ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈస్ట్ లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును జరుపుకున్న మొదటి NRI సంస్థ తెలంగాణ ఎన్నారై ఫోరం. గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణా కుటుంబాల కోరిక మేరకు ఈ సంవత్సరం లండన్ లోని రెండు ప్రదేశాలలో (వెస్ట్ లండన్ & ఈస్ట్ లండన్) బోనాలు జాతరని నిర్వహించింది తెలంగాణ ఎన్నారై ఫోరం. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరైయ్యారు.
ఈ వేడుకలకు స్థానిక కౌన్సిలర్ పాల్ సతినేసాం, శ్రీ A.S.రాజన్(Indian High Commission Minister(Coordination) ) ముఖ్య అతిథులుగా హాజరవడం విశేషం. తెలంగాణ ఎన్నారై ఫోరం ఈ సంవత్సరము ప్రధానంగా చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దం నేతన్నకు మద్దతునిద్దాం' అని 'చేనేత వస్త్రాలయం' ద్వారా ప్రవాసులకు, స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానం ప్రశంసనీయం అని ముఖ్య అతిధులు కొనియాడారు.
ఈ వేడుకలలో భాగంగా తెలంగాణా నేతన్నల నుంచి చేనేత వస్త్రాలను తెప్పించి 'చేనేత వస్త్రాలయం' ద్వారా స్థానిక NRIల కోసం అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు చేసిన విన్నపాన్ని మన్నించి మరియు వారు చేనేతను ప్రదర్శిస్తున్న తీరుకు మెచ్చి పలువురు ఎన్నారై మహిళలు చేనేత వస్త్రాలను ధరించి బోనాలు వేడుకలలో పాల్గొనటం అందరికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. బోనం ఎత్తిన ఆడపడచులందరికి విలువైన కానుకలు మరియు వేడుకలకు హాజరైన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం సంస్థ విద్య, సంగీతం, కళలు, సాంస్కృతిక, క్రీడలు, వ్యాపారం, స్వచ్ఛంద మరియు సమాజ సేవ వంటి పలు రంగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు, యువతీయువకులకు 'ఆచార్య శ్రీ జయశంకర్ పురస్కారములు' అందచేశారు. అలాగే ఈ బోనాలు వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపికలతో ప్రశంశించారు.
సంప్రదాయ తెలంగాణా వంటకాలతో ఏర్పాటు చేసిన విందు హాజరైన వారికి ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ విధంగా మన తెలంగాణా సంస్కృతిని ముందు తరాలకు చేరవేసే అవకాశం కల్పిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాఘం సభ్యులు -
హేమలత గంగసాని, వనమాల గోపతి, నందిని మొట్ట, మంజుల పిట్టల, భారతి కొప్పుల, శ్రీలక్ష్మి మర్యాల, శ్రీవాణి మార్గం, సుచరిత కాల్వ, వర్ష కటికనేని, రజిత నీల, జ్యోతి రెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతీ సీక, శశి కుడికాయల, ఉమగిరివాని, రమాదేవి తిరునగరి, శౌరి రంగుల, వాణి రంగు గార్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన పూజ నిర్వహణ, ఒడి బియ్యం, ఊరేగింపులలో పాల్గొన్న ఆడపడుచులకు ఎంతో తోడ్పాటుని అందించారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం ఎగ్జిక్యూటివ్ టీం - వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, అడ్విసోరీ బోర్డు చైర్మన్ అంతటి ప్రమోద్, అధ్యక్షులు సీకా చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్యకార్యదర్శిలు నగేష్ కాసర్ల, సుధాకర్ రంగుల, ఉమ్మడి కార్యదర్శిలు భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల స్కాట్లాండ్ కన్వినర్ శ్రీధర్ రావు కలకుంట్ల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, క్రీడా కార్యదర్సులు స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల, మీడియా టీం, సాయిప్రసాద్ మార్గం, శిరీష కే చౌదరి, స్వచ్చంద మరియు సంక్షేమ టీం - మీనాక్షి అంతటి, సంతోష్ ఆకుల, ఏరియా ఇంచార్జిలు సంతోష్ ఏరుకుల్ల, ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - చంద్రకాంత్, దేవులపల్లి శ్రీనివాస రావు, శశి కొప్పుల, శ్రీధర్ బాబు మంగళారపు, శ్రీధర్ నల్ల బోనాలు వేడుకలలో చైతన్యవంతంగా పాల్గొన్న వారిలో వున్నారు.