టాలీవుడ్‌లో మరో సెక్స్ స్కాండల్ వెలుగు చూసింది. సినిమా షూటింగ్‌ల పేరిట హీరోయిన్లను అమెరికా వంటి విదేశాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్న గుట్టురట్టయింది. ఈ స్కామ్‌లో నిర్వాహకులైన భార్యభర్తలను చికాగో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో కండోమ్స్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న ఈ సెక్స్ స్కాండల్ వివరాలను పరిశీలిస్తే..
టాలీవుడ్ హీరోయిన్స్‌ను సినిమా షూటింగులంటూ తాత్కాలిక వీసాపై అమెరికాకు పిలిపించి, వారిని ఖరీదైన హోటళ్లలో ఉంచి, విటులను పంపుతున్న వైనాన్ని అమెరికా పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ నిర్వాహకులుగా ఎన్నారై మోదుగుమూడి కిషన్ అలియాస్ విభా జయం (34), ఆయన భార్య చంద్ర అలియాస్ చెన్నుపాటి (31)గా యూఎస్ పోలీసులు గుర్తించారు.
వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా ఈ రాకెట్ నడిపిస్తున్నారనీ, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారివద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేసేవారనీ పోలీసులు వెల్లడించరు. దీంతో ఈ భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం వారివద్ద విచారణ జరుపుతున్నారు.