నేటి యువతలో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. దీనికి కారణాలను కూడా సర్వేలు విశ్లేషిస్తున్నాయి. లైంగిక సామర్థ్యం, ఆసక్తి తగ్గడానికి మానసిక, శారీరక, ఆరోగ్య సమస్యలు కూడా ఓ కారణంగా ఉంది. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. వీటితో పాటు.. ప్రస్తుత ఆహారపు అలవాట్లు కూడా మరో కారణంగా ఉన్నాయి. అయితే, నానాటికీ సన్నగిల్లిపోతున్న లైంగిక పటుత్వాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడికి ఆమడ దూరంలో ఉండాలి. తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లతో కూడిన పండ్లు, ఆకుకూరలు, ఆహార పదార్థాలను ఆరగించాలి.
బాదం, జీడిపప్పు, అక్రోట్స్లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ డొపమైన్ వల్ల శృంగార కోరికలు పెరుగుతాయి.
స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది. కాఫీలోని కెఫైన్ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్‌ను విడుదల చేసి, రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది.