ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రతిపక్ష నేతగా ఎన్నారై మహిళ

FILE
ప్రముఖ ప్రవాస భారతీయురాలు కామ్లా పెర్సద్-బస్సేసర్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటుకు ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రీమియర్ బస్‌డియో పాండే వైదొలగటంతో కామ్లాను ప్రతిపక్షగా నేతగా ఎన్నుకున్నారు. దీంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఎంపికయిన మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేతగా కామ్లా రికార్టు సృష్టించారు.

ఈ మేరకు పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లో అధ్యక్షుడు జార్జ్ మాక్స్‌వెల్ రిచర్డ్స్ యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ (యూఎన్‌సీ) పార్టీ తరపున కామ్లా ప్రతిపక్ష నేతగా ఎంపికయినట్లు ప్రకటించారు. కాగా.. కామ్లాకు మద్ధతు ప్రకటించిన ఏడుగురు ఎంపీలు అధ్యక్ష భవనంలో కలుసుకుని సంతోషంతో విందు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాండీ 34 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ వచ్చారు. చివరి ఆరు సంవత్సరాల్లో మాత్రం ప్రధానిగా పనిచేయటం గమనార్హం.

యూఎన్‌సీ ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు జనవరి 24వ తేదీన ఎన్నిక నిర్వహించింది. ఇందులో పాండీని అధిగమించిన కామ్లా కొత్త నేతగా అవతరించింది. 1980లలో రాజకీయాలలోకి ప్రవేశించిన కామ్లా యస్.టి పాట్రిక్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించారు. సెనేటర్‌గా కూడా సేవలందించిన ఈమె పార్లమెంటేరియన్‌గా కూడా రాణించారు. అదే విధంగా 1995లో పాండీ ప్రభుత్వంలో కామ్లా మొట్టమొదటి అటార్నీ జనరల్‌గా కూడా పనిచేశారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానిమంత్రిగా కూడా పనిచేసిన తొలిమహిళగా గుర్తింపు సాధించారు.

వెబ్దునియా పై చదవండి