అలనాటి ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన అనేక అద్భుత చిత్రాల్లో ఆణిముత్యం... స్వాతిముత్యం (1985). గానకోకిల సుశీల పాడిన ఈ పాట ఎంత మధురంగా ఉంటుందో... ఈ పాట పరిచయమున్నవారికి చెప్పనవసరం లేదనుకుంటాను. సాహిత్యం వల్ల పాటకు అందం వచ్చిందో... లేక... పాడిన గొంతు వల్ల... చక్కటి సాహిత్యం గల పాటకు తియ్యదనం వచ్చిందో ఖచ్చితంగా చెప్పడానికి వీలుకానటువంటి మహత్తరమైన పాట ఇది. అంతటి మహత్తరమైన పాటను రాసిన వారు డా. సి. నారాయణ రెడ్డి.
లాలీ... లాలీ... లాలీ.. లాలి...
పాటకు పాషాణమైనా... కదులుతుందంటారు. పాషాణమేమో గానీ... ఆ మహా దేవదేవుడు మాత్రం ఈ పాటకు తప్పక చలించి ఉంటాడనుకుంటా. ఆనాడు సతీ అనుసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు శిశువులుగా మారిపోతే... ఈనాడు.. ఈ పాట కోసమైనా సరే పసిబిడ్డడుగా....
పాటకు పాషాణమైనా... కదులుతుందని అన్నారో మహాకవి. పాషాణమేమో తెలియదు గానీ... భగవంతుడైన ఆ మహా దేవదేవుడు మాత్రం తప్పక చలించి ఉంటాడనుకుంటా. బహుశా... ఆనాడు సతీ అనుసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు శిశువులుగా మారిపోతే... ఈనాడు.. ఈ పాట కోసమైనా సరే పసిబిడ్డడుగా మారిపోవాలి అనిపించి ఉంటుంది ఆ మహా దేవుడికి.
సుశీలమ్మ ఎన్నో వేల పాటలను పాడి... ఎందరినో తన్మయత్వంలో ముంచింది. తన గాత్రంతో ఎన్ని సార్లు శ్రోతల నయనాలను... ఆనందాశ్రువులతో నింపిందో చెప్పడం కష్టం. పాటకు తానే ప్రాణ వాయువై... సాహిత్యపు జల్లులను సుస్పష్టంగా వినిపించిన అరుదైన గాయనీమణి.. ఆమె స్వరం నుంచి వెలువడిన ఈ పాట మరో మహాద్భుతం అని చెప్పవచ్చు.
ఈ పాట గురించి చెప్పడానికి ఇంకా చాలా ఉన్నా... ఇంతకంటే.. నేను చెప్పాలనుకున్న మాట కూడా ఇప్పటికే ఈ పాట గురించి చాలా మంది చెప్పి ఉంటారన్న ఉద్దేశ్యంతో...
చరణం1: కళ్యాణరామునికి కౌశల్య లాలి.. II 2 II యదువంశ విభునికి యశోద లాలి... II 2 II కరి రాజ ముఖునికి... కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి... II 2 II పరమాంశ భవునికి పరమాత్మ లాలి.. II వటపత్ర శాయికి II
జోజో.. జోజో.. జో.... జోజో.. జోజో.. జో.... చరణం2: అలమేలు పతికి అన్నమయ్య లాలి... II 2 II కోదండరామునికి గోపయ్య లాలి... II 2 II శ్యామలాంగునికి శ్యామయ్య లాలి...II 2 II ఆగమనుతునికి త్యాగయ్య లాలి... II వటపత్ర శాయికి II లాలి... లాలి... లాలి.. లాలి. II 2 II