చుండి నాగభూషణం (ఏప్రిల్ 19, 1921 - మే 5, 1995). ఈరోజు ఆయన వర్థంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడు నాగభూషణం. పేరుకు తగినట్లే విషపు పాత్రలు పోషించేవాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలానే వుంది. క్లుప్తంగా చెప్ప ప్రయత్నం చేసుకుందాం. నాగభూషణంగారి జీవితాన్ని మలుపు తిప్పింది రక్త కన్నీరు నాటకం. దీని గురించి తెలుసుకుందాం.
రాధను అనుకరించేవారు
అప్పట్లో సినిమా పరిశ్రమ మదరాసే. అక్కడ రంగరాజ పురం వీధిలో నాగభూషణం వుండేవారు. నటి రాధిక తండ్రి ఎం.ఆర్. రాధ స్టేజీ నటుడు. సినిమా నటుడు కూడా. ఎం.జి.ఆర్.తో సమానంగా పాత్రలు చేసిన నటుడు ఎం.ఆర్. రాధ. రాధగారి డైలాగ్ మాడ్యులేషన్ భిన్నమైంది. డైలాగ్‌లోని ఆరోహన ,అవరోహనణ, మాట విరుపులు నాగభూషణంను బాగా ఆకట్టాయి. అందుకే ఆయన శైలిని పట్టుకుని తనదైన బాణీలో కొనసాగాడు నాగభూషణం. దాసరినారాయణరావుగారి గురువు పాలగుమ్మలి పద్మరాజుగారు. ఆయన చేసి నాటకమే రక్తకన్నీరు. అప్పటి సామాజిక పరిస్ఙితులకు అనుగుణంగా రాసిన డ్రామా.
రక్త కన్నీరు అంటే?
ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలీదు. మూలాలు తెలుసుకుందాం. పాలగుమ్మిగారు రూపొందించిన రక్తకన్నీరు ఏమంటే, విదేశాలనుంచి వ్యక్తకి ఇక్కడ వ్యవస్థ లోపాలు, నాగరికత పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. ఇక్కడ ఆడవారు కట్టుకునే వస్త్రధారణ, కట్టుబాట్లు వ్యతిరేకిస్తారు. జబ్బల జాకెట్లు వుండాలి. రొమాన్స్ వుండాలి. ఇవన్నీ లేకపోతే నువ్వు ఆడదానివా! అని విసుక్కునే భర్త పాత్ర నాగభూషంది. ఆ తర్వాత వేశ్యా వ్యామోహంలో పడిన ఆయన చివరికి కుష్టి రోగిగా మారిపోతాడు. ఆ తర్వాత సమాజం అతన్ని చూసిన విధానం, భార్య చూపించిన ప్రేమ కళ్తుతెరిపిస్తాయి. ఇక్కడ తళుకుబెళుకులు తాత్కాలికం. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది భార్య మాత్రమే. చివరికి తెలుసుకుని ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళ ఇంకిపోయి రక్తం కళ్లలోంచి కారుతుంది. అదే కర్తకన్నీరు కథ.
ఆ నాటకాన్ని అప్పట్లో ఇరగబడి ఆంధప్రదేశ్ ప్రజలు చూసేవారు. 2వేల ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత నాగభూషణ బిజీగా వున్న రక్తకన్నీరు నాటకం ఆడడం మానలేదు. ఆయన్ను రక్తకన్నీరు నాగభూషం అనేలా పేరు తెచ్చిపెట్టింది. మదరాసుకు దగ్గరలో వున్న ఆంధ్ర ప్రాంతాలైన నెల్లూరు, గూడూరు, సూళ్ళురు పేట దగ్గర నాటకాలు ఆడుతూ సినిమా షూటింగ్ వున్నరోజు వెంటనే వెళ్ళిపోయాఏరు. అప్పట్లో నాటకాభిమానులు అంతా ఆ నాటకం కోసం ఎదురుచూసేవారు. ఆ నాటకం వేశారంటే ఆరోజు ఆ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఖాళీగా వుండేవి. అలా నాగభూషణం పలు నాటకాలు ఆడారు. ఆయన నాటకాల ద్వారా వెలుగులోకి వచ్చినవారే వాణిశ్రీ, శారద, సుజాత వంటివారు.
Nagabushanam
స్లయిలిష్ వేశాలు
నాగభూషణంగారు విలన్ అంటే అరుపులు కేకలు ఫైట్లు చేసేవారుకాదు. మాటల విరుపుతో రక్తికట్టించేవారు. మొదట్లో `ఏది నిజం`, `పల్లెటూరు`, `మాయాబజార్` సినిమాల్లో చిన్న వేశాలు వేశారు. ఆయనకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు. కేవలం నాటకంలో వచ్చిన పేరు వల్ల వచ్చినవే. అప్పట్లో నాటకాలు ఆడేవారినే సినిమా నటులుగా అవకాశాలు లభించేవి. ఇక నాగేశ్వరరావు నటించిన `మంచి మనసులు` సినిమాలో నాగేశ్వరావు, సావిత్రి ప్రేమించుకుంటారు. నాగేశ్వరరావు చెల్లి వాసంతి. ఆవిడను తన మాటలతో పడేసుకుని పాడుచేసే పాత్ర నాగభూషణంది. నాగభూషనంకు గుడ్డి చెల్లెలుంటుంది. తన చెల్లెలిని చేసుకుంటేనే నీ చెల్లిని నేను వివాహం చేసుకుంటానని నాగభూషణం ఫిటింగ్ పెడతాడు. ఇలా లిటికేషన్ పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
ఎన్.టి.ఆర్.కు నాగభూషణం మధ్య ఏ జరిగిందంటే!
ఎన్.టి.ఆర్. పక్కన నటించాలంటే ఆడవారు కాస్త భయపడేవారు. ఆడవారిని కౌగిలించుకుంటే వారు కళ్లు తిరిగిపడిపోయేవారు. విలన్‌ను కొడితే వాడి ఒళ్ళు హూనం అయిపోవాల్సిందే. నిజంగా పాత్రలో లీనమై నటన చేసేస్తాడు ఎన్.టి.ఆర్. అప్పట్లో సర్కస్ రాముడు సినిమాలో రావుగోపాలరావు చేయాల్సిన పాత్ర నాగభూషణం చేయాల్సివచ్చింది. అయితే ఇందులో ఫైట్స్ వున్నాయంటున్నారు. చండ్రా కోలుతో కొడుతూ ఓ పాటకూడా పాడుతూ వీర వాయింపు వాయిస్తారు. అలా కొడితే నా చర్మం లేచిపోతుంది. నెలరోజులపైగా షూటింగ్‌లకు వెళ్ళలేను అని సున్నితంగా చెప్పేశాడట. ఇలా రెండు మూడు సంఘటనలు జరిగాయని అదే వారిద్దరి మధ్య దూరానికి కారణమని సీనియర్ జర్నలిస్టు రామారావు ఓ సందర్భంలో చెప్పాడు.
ఇదీ అసలు జరిగింది!
అది నిజమైనా, అసలు విషయం వేరుగా వుంది. సహజంగా రామారావు షూటింగ్ లొకేషన్‌కు వచ్చినా అందరూ ఆయన కాళ్ళమీదపడి నమస్కారం పెట్టేవారట. అది రాజకీయాల్లోనూ రివాజుగా మారింది. ఈ విషయం తెలిసిందే. ఇక షూటింగ్ సందర్భాలలో ఒక్క నాగభూషణం మినహా అందరూ ఆయన రాగానే లేచి నిలబడి, నమస్కారం పెట్టేవారు. కానీ ఒక్క నాగభూషణం లేచేవాడు కాదు. కూర్చునే నమస్కారం అనేవారట. ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చున్న రామారావులాగేనే కాలుమీద కాలేసుకుని ఈయనా కూర్చునేవారు.
ఇక సహజమేగదా. పక్కనవారు ఏదో చెప్పడం.. వినడం. అసలే ఇగో ఫీల్డుఅయిన సినిమారంగంలో నటులకు అహం దెబ్బతింది. దాంతో నాగభూషణంను దూరంగా పెట్టారని ఆయన బంధువులు తెలియజేస్తున్నారు. వెబ్‌దునియాతో వారు ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంగా ఉచ్చరించిన మాటలివి. ఇక నాగభూషణం రెండో భార్య కుమార్తె, కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే వుంటున్నారు. కుమార్తె కూచిపూడి కళాకారిణి కూడా. ఇదండీ అసలు విషయం.