సొంత గడ్డపై జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో చైనా క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా క్రీడాకారుల అధిపత్యంగా సాగే ఒలింపిక్ పోటీలు ఈ దఫా మాత్రం కాస్త భిన్నంగా సాగుతోంది. చైనా రాజధాని బీజింగ్‌లో తొలిసారి ఒలింపిక్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో చైనా క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణిస్తూ బంగారు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నారు.
పోటీలు ముగిసే ఆఖరి రోజైన ఆదివారంకు చైనా వంద పతకాలను గెలుచుకుని అగ్రస్థానంలో ఉంది. వీటిలో బంగారు పతకాలు 51 ఉండగా, వెండి పతకాలు 21, కాంస్య పతకాలు 28 చొప్పున ఉన్నాయి. అలాగే 36 పతకాలతో అమెరికా ద్వితీయ స్థానంలో ఉండగా, 23 బంగారు పతకాలతో రష్యా తృతీయ స్థానంలో ఉంది.
అయితే.. బంగారు, వెండి, కాంస్య పతకాల పరంగా చూస్తే ఇప్పటి వరకు అమెరికా 110 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, 100 పతకాలతో చైనా ద్వితీయ స్థానంలోనూ, 72 పతకాలతో రష్యా తృతీయ స్థానంలో కొనసాగుతోంది.