ఒలింపిక్ పదనిసలు : గుర్రాలూ డోపింగ్ దోషులే

శుక్రవారం, 22 ఆగస్టు 2008 (15:00 IST)
ఒలింపిక్‌లో పతకాలను పొందేందుకు క్రీడాకారులు ఒక్కోసారి అడ్డదారులను ఆశ్రయించే సంగతి తెలిసిందే. ఈ కోవలోనే కొందరు క్రీడాకారులు ఉత్ప్రేరకాలను ఉపయోగించడం ద్వారా తమ క్రీడా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ డోపింగ్ పరీక్షలు కఠినతరం కావడంతో ఈ తరహా క్రీడాకారులు దొరికిపోతున్న ఘటనలు కోకొల్లలు.

అయితే ప్రస్తుతం డోపింగ్ వ్యవహారం అనేది ప్రస్తుతం క్రీడాకారుల నుంచి వారు ఉపయోగించే గుర్రాల స్థాయికి చేరింది. ఈ విషయాన్ని రుజువు చేస్తూ తాజాగా జరిపిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడడంతో నాలుగు గుర్రాలను ఒలింపిక్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.

ఒలింపిక్ క్రీడల్లోని జంపింగ్ పోటీల్లో పాల్గొనాల్సిన ఈ గుర్రాలను పోటీలకు అనుమతించకుండా అంతర్జాతీయ ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ నిషేధం విధించింది. బ్రెజిల్, జర్మనీ, ఐర్లాండ్, నార్వేలకు చెందిన క్రీడాకారులు వినియోగిస్తున్న ఈ గుర్రాలకు డోపింగ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఫలితాలు రావడంతో ఈ గుర్రాలను పోటీల్లో వినియోగించకుండా నిషేధం విధించారు.

వెబ్దునియా పై చదవండి