ఒలింపిక్ బేస్‌బాల్ : కాంస్యంతో సరిపెట్టుకున్న అమెరికా
శనివారం, 23 ఆగస్టు 2008 (13:09 IST)
బీజింగ్ ఒలింపిక్స్ బేస్‌బాల్‌లో అమెరికా కాంస్యంతో సరిపెట్టుకుంది. ప్రత్యర్థి క్యూబా ఇచ్చిన షాక్‌తో బేస్‌బాల్‌లో ఫైనల్ చేరాలనుకున్న అమెరికా ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.
బీజింగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించిన క్యూబా ఏదశలోనూ అమెరికాను కోలుకోనీయలేదు. దీంతో 2-10 తేడాతో అమెరికా ఓటమి చవిచూసింది. సెమీ ఫైనల్ విజయంతో ఫైనల్‌కు చేరుకున్న క్యూబా శనివారం దక్షిణ కొరియాతో తలపడనుంది.
ఒలింపిక్స్‌లో బేస్‌బాల్‌ను ఓ క్రీడాంశంగా ప్రవేశపెట్టాక క్యూబా మూడుసార్లు విజేతగా నిలిచింది. అదే సమయంలో అమెరికా ఒక్కసారి విజేతగా నిలిచింది. ప్రస్తుతం శనివారం జరగనున్న మ్యాచ్‌లో క్యూబా మరోసారి విజేతగా అవతరిస్తుందో లేదో వేచి చూడాలి.