ఒలింపిక్ మహిళల హాకీ : నెదర్లాండ్ స్వర్ణం కైవసం

శనివారం, 23 ఆగస్టు 2008 (14:24 IST)
బీజింగ్ ఒలింపిక్ మహిళల హాకీ స్వర్ణాన్ని నెదర్లాండ్ చేజిక్కించుకుంది. ఫైనల్ పోరులో ఆతిథ్య దేశం చైనాకు చెక్ చెప్పడం ద్వారా నెదర్లాండ్ 2-0 తేడాతో స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది. గత ఏథేన్స్ ఒలింపిక్‌లో ఫైనల్ ఓడి రజతాన్ని దక్కించుకున్న నెదర్లాండ్ తాజా ఒలింపిక్‌లో స్వర్ణాన్ని దక్కించుకోవడం గమనార్హం.

మహిళల హాకీ విభాగంలో చైనా రజత పతకాన్ని గెల్చుకోవడం ఇదే ప్రథమం కావడం విశేషం. ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించిన నెదర్లాండ్ ఫైనల్‌లో తిరుగులేని విజేతగా నిలిచింది. అదేసమయంలో ఈ విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో జర్మనీని 3-1 తేడాతో ఓడించడం ద్వారా అర్జెంటీనా పతకం సాధించింది.

వెబ్దునియా పై చదవండి