ఒలింపిక్స్ ప్రత్యేక కార్యక్రమాలు : బీబీసీ

మంగళవారం, 5 ఆగస్టు 2008 (14:19 IST)
చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్స్‌పై ప్రత్యేక కార్యక్రమాలను బ్రిటన్‌ను చెందిన టీవీ ఛానెల్ బీబీసీ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమాలను మై గేమ్స్ పేరిట బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారం చేస్తుంది. విశ్వ క్రీడలపై వారంలో నాలుగు రోజులపాటు మై గేమ్స్ పేరిట ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని బీబీసీ తెలిపింది.

బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రేక్షకులు తమ ఆలోచనలు, వీడియోలు, పిక్చర్లను ఈమెయిల్ ద్వారా తమకు పంపించుకోవచ్చునని తెలిపింది. చైనా రాజధాని బీజింగ్ నుంచి బీబీసీ వరల్డ్ న్యూస్‌కు చెందిన స్పోర్ట్ టుడే కార్యక్రమానికి అదానన్, మిషాల్ హుస్సేన్‌లు ఆగస్టు 6వ తేదీ నుంచి ప్రత్యక్ష కార్యక్రమాలను అందిస్తారు.

బీబీసీ వరల్డ్ న్యూస్ ఛానెల్‌లో ఎక్స్‌ట్రా టైంలో ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ ఇంటర్వ్యూలు, ట్రావెల్ ప్రోగ్రాంలు ఉంటాయి. ఫాస్ట్‌ట్రాక్‌లో క్రీడాభిమానుల నిరంతరాయ కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. వీటితో పాటుగా చైనాకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రసారం చేయటానికి బీబీసీ చర్యలు చేపట్టింది.

వెబ్దునియా పై చదవండి