అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దేవి

శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (13:57 IST)
Arjun Son Of Vyjayanthi
నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసే హై ఎమోషన్ యాక్షన్ మూవీగా చిత్రాన్ని ట్రీట్ చేశారు. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా నిర్మాతలు.నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న శుక్రవారం (నేడు) థియేటర్లలో విడుదలైంది
 
కథ:
అర్జున్ తండ్రిని కొందరు చంపేస్తారు. వారిపై పగతో రగిలిపోయి చంపేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ తల్లి వైజయంతి (విజయ శాంతి) పోలీస్ ఆఫీసర్ కనుక చట్ట ప్రకారం వెళదామనుతుంది. అనంతరం ఐపీఎస్ రాసి పోస్టింగ్ టైంలో తల్లిపై కొందరు దుండగులు ఎటాక్ చేస్తారు. అది తెలిసిన అర్జున్ ఏమి చేశాడు అన్నది మిగిలిన కథ. 
 
సమీక్ష:
తెలుగులో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. కానీ విజయశాంతి పాత్రతో కొత్తగా అనిపిస్తుంది. ఆమె ఈ సినిమాకు అసెట్ అని చెప్పవచ్చు. ఇక కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్స్ ఉన్నా, హింస ఎక్కువగా ఉంది. సంగీత పరంగా పాటలు ఒకే. సినిమాటోగ్రాఫీ బాగుంది. 
Arjun Son Of Vyjayanthi

 
కానీ దర్శకుడు కొత్తకోణంలో తీసే ప్రయత్నంలో కొంచెం తడబడ్డాడు. నటనపరంగా అందరూ బాగానే చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓన్ రిలీస్ చేశారు. అయితే దర్శకుడు మరింత మెరుగ్గా తీస్తే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. సంభాషణలు మామూలుగా ఉన్నాయి. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా ఓకే అని చెప్పవచ్చు.
 
రేటింగ్.. 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు