బీజింగ్ ఒలింపిక్ : పతకాల పట్టికలో టాప్ టెన్

శనివారం, 23 ఆగస్టు 2008 (12:56 IST)
ఆగస్టు 08న రాత్రి 08 గంటల 08 నిమిషాల 08 సెకన్లకు ప్రారంభమై బీజింగ్ ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటేందుకు భారత్‌తో సహా 204 దేశాలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. బీజింగ్ ఒలింపిక్స్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైనా పోటీల్లో ఎక్కువ పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలని కూడా తహ తహలాడుతోంది.

చైనా నేతల ఆశలను వమ్ము చేయని రీతిలో ఆగస్టు తొమ్మిది నుంచి ప్రారంభమైన విశ్వ క్రీడల సంగ్రామంలో ఆ దేశ క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధిస్తూ పతకాల పట్టికలో తమ దేశం అగ్ర స్థానంలో నిలేచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే ఆగస్టు 11న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించి పతకాల వేటకు బోణీ చేశాడు.

వ్యక్తిగత స్వర్ణం సాధించడం ద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడిగా అభినవ్ కీర్తి సంపాధించాడు. బింద్రా తర్వాత ఆగస్ట్ 20న జరిగిన రెజ్లింగ్ పోటీల్లో సుశీల్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా భారత్‌ ఖాతాలో రెండో పతకం చేరింది. అలాగే బాక్సింగ్‌లో విజేందర్ కాంస్య పతకం సాధించడంతో భారత పతకాల సంఖ్య మూడుకు చేరుకుంది. ఈ పరిణామంతో ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ ప్రస్థానం క్రింది విధంగా ఉంది.

స్వర్ణం
రజతం
కాంస్యం
మొత్తం
భారత్
01
00
02
03


అదే సమయంలో బీజింగ్ ఒలింపిక్స్ ఆతిథ్య దేశమైన చైనా పతకాల వేటలో అందరికంటే ముందుంది. ఆ తర్వాతి స్థానంలో అమెరికా కొనసాగుతోంది. ఇలా పతకాల వేటలో పోటీపడుతోన్న పది దేశాల పతకాల పట్టిక తాజా పరిస్థితి క్రింది విధంగా ఉంది.

దేశం పేరు
స్వర్ణం
రజతం
కాంస్యం
మొత్తం
చైనా
47
17
25
89
అమెరికా
31
36
35
102
జర్మనీ
14
09
13
36
దక్షిణ కొరియా
11
10
07
28
ఇటలీ
07
08
10
25
జపాన్
09
06
10
25
ఆస్ట్రేలియా
12
14
16
42
రష్యా
17
18
22
57
ఫ్రాన్స్
05
13
16
34
గ్రేట్ బ్రిటన్
18
13
13
44


ఈ దేశాలు మాత్రమే కాక మరికొన్ని దేశాలు సైతం పతకాల వేటను కొనసాగిస్తున్నాయి.