రాష్ట్రపతి చెంతకు విజేందర్, సుశీల్‌ కుమార్

సోమవారం, 25 ఆగస్టు 2008 (17:19 IST)
బీజింగ్ ఒలింపిక్‌లో పతకాలు సాధించిన విజేందర్ కుమార్, సుశీల్ కుమార్‌లు మంగళవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలవనున్నారు. బీజింగ్ నుంచి ప్రస్తుతం భారత్ చేరుకున్న వీరిద్దరూ మర్యాద పూర్వకంగా రాష్ట్రపతిని కలవనున్నారు.

ఈ విషయమై రాష్ట్రపతి భవన్ అధికారులు మాట్లాడుతూ భారత్ తరపున పతకాలు సాధించడం ద్వారా దేశ గౌరవాన్ని ఇనమడింపజేసిన సుశీల్, విజేందర్‌లను రాష్ట్రపతి అభినందించనున్నట్టు తెలిపారు.

ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా భారత్ మూడు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించగా రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, బాక్సింగ్‌లో విజేందర్‌లు కాంస్య పతకాలను సాధించారు. రెజ్లింగ్‌లోని 66 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కాంస్యాన్ని సొంతం చేసుకోగా విజేందర్ బాక్సింగ్‌లో సెమీ ఫైనల్ వరకు చేరుకోవడం ద్వారా కాంస్యాన్ని సాధించాడు.

వెబ్దునియా పై చదవండి