రెహ్మాన్‌పై టాలీవుడ్ ప్రశంసల జల్లు

WD
చనలచిత్రానికి తలమానికంగా నిలిచిన ఆస్కార్ అవార్డును భారతీయునికి దక్కడం పట్ల భారత చలనచిత్రరంగంతోపాటు తెలుగు చలనచిత్ర రంగంలోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఒకే రోజు రెండు పండుగలు జరుపుకున్నట్లు ఉందని పలువురు సినీ ప్రముఖులు అభివర్ణించారు.

సోమవారంనాడు శివరాత్రి కావడం, రెహమాన్‌కు ఆస్కార్ రావడం పట్ల వారు ఈ విధంగా వ్యాఖ్యానించారు. "స్లమ్ డాగ్ మిలియనీర్‌"కు గాను ఉత్తమ ఒరిజినల్ విభాగంలోను, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో (జయ హో..) రెండు ఆస్కార్ అవార్డులు రెహ్మాన్‌కు దక్కాయి.

వ్యక్తిగత క్యాటగిరీలో ఒకేసారి రెండు అవార్డులు దక్కడం విశేషం. ఈ సందర్భంగా అమ్మ ఆశీస్సులతో తానింతటి వాడినయ్యానని రెహ్మాన్ పేర్కొనడంపట్ల పలువురు రెహ్మాన్ ఉన్నతిని ప్రశంసించారు. ముఖ్యంగా సంగీత దర్శకులందరూ ఓ పండుగ వేడుకను చవిచూశారు. కథానాయకులు, దర్శకులు, నిర్మాతలు కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి