కృష్ణపక్షం, శుక్రవారం, పంచమి తిథి.. వారాహికి కొబ్బరి దీపం వేస్తే..?

శుక్రవారం, 7 జులై 2023 (09:12 IST)
ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం పంచమి తిథి శుక్రవారం, జూలై 7న వస్తుంది. ఈ రోజున వారాహీ అమ్మవారికి కొబ్బరితో దీపం వెలిగిస్తే సకలశుభాలు చేకూరుతాయి. శుక్రవారం సాయంత్రం పూట వారాహి అమ్మవారికి కొబ్బరి దీపాన్ని ఆలయాల్లో వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పంచమి తిథి జూలై 8వ తేదీ అర్ధరాత్రి 12:17 వరకు ఉంటుంది. ఆ తర్వాత వెంటనే షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. 
 
ఈ రోజున చంద్రుడు కుంభ రాశిలో ఉండి సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. ఈ రోజున వారాహి దేవిని వజ్ర ఘోషం అని స్మరించుకుంటూ వుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం పూట అమ్మవారికి పానకం, నల్లద్రాక్షలు, అరటిపండ్లు, నల్ల నువ్వుల వుండలు, ఉడికించిన చిలకడ దుంపలను నైవేద్యంగా సమర్పించవచ్చు. 
Coconut Lamp
 
అలాగే చామదుంపలు కూడా నైవేద్యంగా సమర్పించి వంటల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా దుంపలు వారాహీ దేవికి ప్రీతికరం. ఎందుకంటే అవి భూమి లోపలి నుంచి సాగుబడి అవుతాయి కాబట్టి. వారాహీ దేవి భూమాత, సప్తకన్యల్లో ఒకరు, విష్ణు అంశగా ఆమెను పరిగణిస్తారు. అందుచేత వారాహీ దేవి పూజతో విష్ణుదేవుని అనుగ్రహం కూడా లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు