శ్రావణమాసంలో పూర్ణిమకు అంటే పున్నమి నాటికి ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు 24, 2018) నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానమాచరించి.. పట్టుచీరలను ధరించాలి. పూజగదిని శుభ్రపరుచుకుని.. పుష్పాలతో అలకరించుకోవాలి. కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి.
శ్రీ వరలక్ష్మిని కీర్తిస్తూ.. ఆవాహనం చేసిన వరలక్ష్మీని ధ్యాన ఆవాహ నాది షోడశోపచారాలతో, అష్ణోత్తరశత నామాలతో అర్చించి అనేక విధాలైన భక్ష్యాలను, పిండివంటలను, ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేయబడిన తోరాన్ని అర్చించి, దాన్ని కుడిచేతికి కట్టుకుని భక్తిగా ప్రదక్షిణ, నమస్కారాలు సమర్పించాలి. ఇంటికొచ్చిన ముత్తైదువలకు వాయనం ఇవ్వాలి.