ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే లక్ష్మి అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఈ ఉసిరి చెట్టు విష్ణుమూర్తి అంశ కావడంతో ఉసిరి చెట్టులో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఉసిరి లక్ష్మీ కుబేరుల వృక్షం కావడంతో భక్తులు ఇంట్లో పెంచుకుంటారు. ఇంట ఉసిరి చెట్టు వుండటంతో దేవతా అనుగ్రహం కూడా పెరుగుతుంది. ఈ ఉసిరి చెట్టుకు దైవ శక్తి ఉండడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రవేశించదు.
ఇంట్లో ఉసిరి చెట్టును నాటలేక పోతే.. ఆలయంలో వుండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం ద్వారా సంపద, జ్ఞానం, కీర్తి పెరుగుతుంది. ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ, మధ్యలో శ్రీ విష్ణువు, కాండంలో శివుడు వుంటారని విశ్వాసం. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటే ఉసిరి చెట్టుకు ఏడుసార్లు నూలు తిరిగి తిరిగి కట్టాలి.